Karimnagar: ప్రైవేటు విద్యా, వైద్య సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి

Karimnagar: కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రైవేటు స్కూళ్లు, ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 1 Aug 2026 11:45 PM IST
Karimnagar
X

Karimnagar: ప్రైవేటు విద్యా, వైద్య సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి

కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల తో పాటు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒక్కో విద్యాసంస్థ ఒక్కో విధంగా ఫీజులు నిర్ణయిస్తూ విద్యార్థుల తల్లి దండ్రుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు.

ప్రైవేటు ఆసుపత్రిలో పేషంట్ల నుండి రకరకాల టెస్టుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారన్నారు. సామాన్యుడు ప్రైవేటు విద్యా వైద్య సంస్థల్లోకి వెళ్లలేని పరిస్థితి దాపురించిందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో, ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం చేస్తే పేద బడుగు బలహీన వర్గాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు లేక వెలవెలబోతున్నాయన్నారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న కాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. పాఠశాలల్లో స్వీపర్, అటెండర్స్ లేకపోవడంతో విద్యార్థులే పాఠశాలలను శుభ్రం చేస్తున్నారని, బడి గంట కొడుతున్నారని వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని పాఠశాలల్లో , కళాశాలలో ప్రహరీ గోడలు లేక విద్యాసంస్థల్లో ఉన్న విలువైన వస్తువులకు సెక్యూరిటీ లేకుండా పోయిందన్నారు.

శిథిలావస్థలో ఉన్న క్లాసు రూమ్ లను పడగొట్టి కొత్త క్లాసు రూమ్ లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తాగడానికి కొన్ని పాఠశాలల్లో మంచి నీటి సౌకర్యం కూడా లేదన్నారు.

పాఠశాలల్లో పెద్ద పెద్ద భారీ వృక్షాలు ఉండడం మూలంగా బలమైన గాలులు వేస్తే క్లాసు రూమ్ లపై ఆ వృక్షాలు పడి పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉందన్నారు. వర్షం వస్తే మోకాల్లోతు నీటిలో పాఠశాలల ఆవరణలు ఉంటున్నాయన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు సరిపడ మాత్రలు ఇవ్వడం లేదన్నారు.

కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బిపి టాబ్లెట్లు లేవని అన్నారు. ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించకుండా వాళ్లకు నచ్చిన టైం లో ఆసుపత్రులకు వెళుతూ వస్తున్నారు అన్నారు.

ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి రోగులకు సరిపడా టాబ్లెట్లు అందుబాటులో ఉంచి, అవసరమైన టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు.

ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం 14 రకాల నిత్యవసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా అర్హులైన పేదలందరికీ ప్రతినెలా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందించాలని, టిఆర్ఎస్ హాయంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యా వైద్య రంగాల్లో ఫీజుల నియంత్రణ చట్టం వచ్చేవరకు దశలవారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, జి.బీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునుటి శ్రీనివాస్, సుంకర సంపత్, జి రాజేశం,

కే నాగరాణి, జిల్లానాయకులు తిప్పారపు సురేష్, గజ్జల శ్రీకాంత్, రాయికంటి శ్రీనివాస్,

కే.అరవింద్, పుల్లెల మల్లయ్య, వడ్ల రాజు, వినయ్, కనకరాజు, అరవింద్, శివ, భోగేష్, రాజ్ కుమార్, సత్యనారాయణ, ఎండి గోరెమియ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story