Karimnagar: హోరెత్తిన సీపీఎం 'జైల్ భరో': తెలంగాణ చౌక్ దిగ్బంధం, నేతల అరెస్ట్!
Karimnagar: కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద సీపీఎం, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో 'జైల్ భరో' కార్యక్రమం నిర్వహించారు.
Karimnagar: హోరెత్తిన సీపీఎం 'జైల్ భరో': తెలంగాణ చౌక్ దిగ్బంధం, నేతల అరెస్ట్!
కరీంనగర్: ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా కరీంనగర్లో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు సంఘం, కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని కళాభారతి నుండి ర్యాలీగా బయలుదేరి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీని కొనసాగించారు.
అనంతరం ర్యాలీగా వచ్చిన సిపిఎం నాయకులు తెలంగాణ చౌకు వద్ద గల నాలుగు రోడ్లను దిగ్బంధించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. కార్మిక చట్టాలను తీసుకువచ్చి, కార్మికులపై పని భారాన్ని పెంచాలని అన్నారు.
నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను తీసివేయాలని, వి బి జి రామ్ పథకం వల్ల ప్రజలు ఉపాధి కోల్పోయే పరిస్థితులు తీసుకొస్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని తొలగించే ఉద్దేశంతోనే కొత్తగా విభజి రామ్ పథకం తీసుకురావడం ఉద్దేశమని కనిపిస్తుందని మండిపడ్డారు. పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఈ విభజీ రామ్ పథకం తీసుకొచ్చారన్నారు.
బిజెపి పాలనలో కేవలం సంస్థలు బాగుపడ్డాయని దివాలాలో ఉన్న ఆదాని, అంబానీ కంపెనీలు దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగా అన్నారు దీనికి బిజెపి కొమ్ము కాస్తూ ప్రజలపై అధిక భాగం వేసి దోచిపెడుతున్నారని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు మానుకోకుంటే రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలను చేపట్టి ప్రజలకు వివరిస్తూ నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
రోడ్డుపై బైఠాయించి సుమారు గంటపాటు నిరసన తెలపడంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించాయి, పోలీసులు నాయకులను కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలతో పాటు కుల వివక్ష పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.




