Karimnagar: స్మార్ట్ సిటీ నిధులు ఎటుపోతున్నాయి? గుడికందుల సత్యం!

Karimnagar: స్మార్ట్ సిటీ కరీంనగర్‌లో అద్వానంగా మారిన రోడ్లపై సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం ఆగ్రహం.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 2 Aug 2026 1:31 PM IST
Karimnagar
X

Karimnagar: స్మార్ట్ సిటీ నిధులు ఎటుపోతున్నాయి? గుడికందుల సత్యం!

Karimnagar: స్మార్ట్ సిటీ గా ఎంపికైన కరీంనగర్ పట్టణంలోని రోడ్లు అద్వానంగా ఉన్నాయని చిరుజల్లులకే చెరువులను తలపిస్తున్నాయి అన్నారు. కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ స్ట్రీట్, సుభాష్ నగర్, మంచిర్యాల చౌరస్తా నుండి నాకా చౌరస్తా వెళ్లే ప్రధాన రహదారి,గాంధీ రోడ్, నాకా చౌరస్తా నుండి బొమ్మ వెంకన్న, టవర్ సర్కిల్ వెళ్లే దారి పూర్తిగా పాడైపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

మంచిర్యాల చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ వెళ్లే దారి పొలాలను తలపిస్తుందని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

స్మార్ట్ సిటీ నిధులు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా నగర మేయర్ ,మున్సిపల్ కమిషనర్ ,రోడ్లు మరియు భవన నిర్మాణ శాఖ అధికారులు స్పందించి రోడ్లను వెంటనే బాగు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story