Karimnagar: కోర్టు చౌరస్తాలో సీపీఎం ఆందోళన.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
Karimnagar: కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో సిపిఎం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.
Karimnagar: కోర్టు చౌరస్తాలో సీపీఎం ఆందోళన.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
కరీంనగర్: బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ మైనర్ బాలికను వేధించి, అత్యాచారం చేసిన బండి సాయి భగీరథును 9 రోజులు దాచిపెట్టి, కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని తేల్చడంతో విదిలేని పరిస్థితుల్లో బండి సంజయ్ తన కొడుకుని సరెండర్ చేయించాడని అన్నారు. పోలీసులు అరెస్టు చేశామని ఒక ప్రకటన తెలిపారు.
అరెస్ట్ చేశారా? బండి సంజయ్ నే సరెండర్ చేశారా? ఇప్పటికీ తేల్చలేదని అన్నారు. న్యాయవ్యవస్థ మీద చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే సరెండర్ చేయించాను అంటున్న బండి సంజయ్ 9 రోజులుగా ఎందుకు దాచి పెట్టాడని? చట్టం మీద గౌరవం లేకనే దాచిపెట్టాడా అని ప్రశ్నించారు. బండి సంజయ్ కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టే 9 రోజులు తన కొడుకును దాచిపెట్టగలిగాడని, సాధారణ వ్యక్తులకు అది సాధ్యం కాదని అన్నారు. బండి సంజయ్ మంత్రి పదవిలో ఉంటే న్యాయ విచారణ సరిగ్గా జరగదని, తన పదవిని అడ్డుపెట్టుకొని కేసును ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే నరేంద్ర మోడీ మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని అన్నారు. అప్పుడే బాధిత బాలికకు న్యాయం జరుగుతుందని అన్నారు. అరెస్టు చేసిన బండి సాయి భగీరథుని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. బండి సంజయ్ రాజీనామా చేసే వరకు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ సిపిఎం పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు,పుల్లెల మల్లయ్య,పున్నం రవి,ఆసంపల్లి వినయ్, నాయకులు రాయికంట శ్రీనివాస్,సన్నీ తదితరులు పాల్గొన్నారు.




