Jammikunta: డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే పంపిణీ చేయాలి.. మిల్కూరి వాసుదేవరెడ్డి
Jammikunta: జమ్మికుంటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో జాప్యంపై సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి హెచ్చరిక.
Jammikunta: డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే పంపిణీ చేయాలి.. మిల్కూరి వాసుదేవరెడ్డి
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు పడక గదుల ఇళ్ళను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా పేదల సహనాన్ని పరీక్షించవద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి హెచ్చరించారు. వడ్లూరి కిషోర్ అధ్యక్షతన జమ్మికుంట మండల కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా 2017-18లో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం ప్రారంభించింది అని 80% ఇండ్లు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్న.పేదలకు.కేటాయించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.ఎవరికి పంపిణీ చేయకపోవడం మూలంగా ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందన్నారు. నాటి టిఆర్ఎస్ పాలనలో అసంపూర్తిగా ఇండ్లు కట్టించి వదిలేసిందన్నారు. నేటి కాంగ్రెస్ పాలనలో అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేసి పేదలకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు, వాటర్, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గతంలో అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారని గుర్తు చేశారు.
రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకి ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు ఇళ్లను అందజేయడంలో ఆలస్యం జరిగే కొద్దీ ఇళ్లకు ఉన్న తలుపులు, కిటికీలు, గ్లాసులు, మెటీరియల్ పాడైపోతున్నాయన్నారు.జిల్లా అధికార యంత్రాంగం సందర్శనలు, పరిశీలనలతో కాలయాపన చేస్తున్నారని మరమ్మత్తులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను ఎప్పుడు పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయకుండా ఉద్దేశ పూర్వకంగా స్థానిక ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు.స్థానికప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం మీద నమ్మకంతో పేదలు ఇంకా ప్రజా ప్రతినిధుల ఇళ్ల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల.చుట్ట.తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదల సహనాన్ని ఓపిక ను పరీక్షించకుండా వెంటనే ఇళ్ళను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు వెంటనే పేదలకు ఇళ్లను పంపిణీ చేయకుంటే పేదలతో కలిసి పోరాటాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి. ఆరుగాలం కష్టించి అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి పంటలు పండిస్తే అమ్ముకోవడానికి అన్నదాతలు
అరిగోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజులైనా కొనుగోలు సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారని తేమ పేర్లతో, తాలు పేరుతో రైస్ మిల్లర్లు రైతుల రక్తం తాగుతున్నారని, క్వింటాల్ కు 6 నుండి 10 కిలోలు కోత విధిస్తున్నారని అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో దోపిడీ జరుగుతున్న అధికారులు అంటి ముట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.
ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డది చరిత్రలో లేదన్నారు.కొనుగోలు సెంటర్లలో కాటాలు పూర్తయి 10 రోజులు అవుతున్న ఎగుమతులు చేయకపోవడంతో బస్తాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన వరి ధాన్యం, మొక్కజొన్న పంట డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. వేసవికాలం దృష్ట్యా తాగునీటిని ప్రతి ఇంటికి సరఫరా చేయాలన్నారు. బోర్లు ఎండిపోయి, మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల శంకర్, మండల కమిటీ సభ్యులు గండి సతీష్, జక్కుల రమేష్, బసిర సంపత్ రావు, వడ్లూరి కిషోర్, మధునయ్య, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.




