Jagtial: జగిత్యాల మోతె చెరువులో ప్రత్యక్షమైన మొసలి స్థానికుల భయం!
Jagtial: జగిత్యాల మోతె చెరువులో మొసలి ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు పట్టుకోవాలని కోరుతున్నారు.
Jagtial: జగిత్యాల మోతె చెరువులో ప్రత్యక్షమైన మొసలి స్థానికుల భయం!
Jagtial: జగిత్యాల పట్టణ శివారులోని మోతె చెరువులో మొసలి ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.మంగళవారం మధ్యాహ్న సమయంలో చెరువు నీటి ఉపరితలంపై ఒక మొసలి తేలుతూ కనిపించడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఈ విషయాన్ని చుట్టుపక్కల ప్రజలకు తెలియజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీటితో పాటు ఈ మొసలి చెరువులోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
చెరువులో మొసలి సంచరిస్తున్న వార్త వేగంగా వ్యాపించడంతో ఆ వైపు వెళ్లడానికి ప్రజలు భయపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకముందే అటవీశాఖ, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. చెరువులో ఉన్న మొసలిని సురక్షితంగా పట్టుకుని, జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story




