Vemulawada: దీపకాంతుల్లో దక్షిణ కాశీ.. వేములవాడలో వైభవంగా లక్ష దీపోత్సవం!

Vemulawada: కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయంలో మంగళవారం లక్ష దీపోత్సవం, జ్వాలాతోరణ మహోత్సవం వైభవంగా జరిగాయి. ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

BABU, VEMULAWADA
Published on: 24 Nov 2026 10:35 PM IST
Vemulawada
X

Vemulawada: దీపకాంతుల్లో దక్షిణ కాశీ.. వేములవాడలో వైభవంగా లక్ష దీపోత్సవం!

Vemulawada: కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయం దీపకాంతులతో వెలిగిపోయింది. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష దీపోత్సవం, జ్వాలాతోరణ మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, శివనామస్మరణతో క్షేత్రం మార్మోగింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

సాయంత్రం ఆలయ ప్రాంగణం, గుడి చెరువు గట్టు, భీమేశ్వర ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. జ్వాలాతోరణం కింద నుంచి భక్తులు భక్తిశ్రద్ధలతో నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA