Manthani: మంథనిలో దళిత యువకుడి దారుణ హత్య

Manthani: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన దళిత యువకుడు జూల వంశీ దారుణ హత్యకు గురయ్యాడు. వివాహితతో ఫోన్ సంభాషణలే ప్రాణం తీశాయి.

SHANKAR, MANTHANI
Published on: 10 May 2026 5:01 PM IST
Manthani
X

Manthani: మంథనిలో దళిత యువకుడి దారుణ హత్య

మంథాని: వివాహితతో ఫోన్ సంభాషణ దళిత యువకుడు దారుణ హత్య. హైదరాబాద్ లో హత్య చేసి మంథని గాడిదల గండి లో పడేసిన వివాహిత భర్త, మరో వ్యక్తి. మిస్సింగ్ కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోలేదని రోడ్డుపై బైఠాయించిన మృతుని కుటుంబ సభ్యులు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్య గురయ్యాడు.

ఆదివారం ఉదయం మంథని మండలం గాడిదల గండి సమీపంలో కుళ్లిన స్థితిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్ 30వ తేదీ నుండి వంశీ కనబడకుండా పోవడంతో నాలుగు రోజుల తర్వాత అతని కుటుంబ సభ్యులు గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వంశీ అదే గ్రామానికి చెందిన ఒక యువతితో గతంలో ప్రేమ వ్యవహారం నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత క్రమంలో ఆమె వేరొకరిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది.

ఇటీవల గ్రామ దేవతల కొలుపు సందర్భంగా తిరిగి గ్రామానికి వచ్చిన యువతితో మళ్లీ అతను చనువుగా వ్యవహరించడంతో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. గమనించిన వివాహిత భర్త నీలం నవీన్ ఏప్రిల్ 30న హైదరాబాద్ కు పిలిపించి స్నేహితుడైన బుర్ర భాస్కర్ గదిలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని భాస్కర్ కార్ లో హైదరాబాదు నుండి మంథని సమీపంలోని గాడిదల గండిలో వేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్న ప్రియురాలు భర్త.

ఉదయం నుండి సంఘటన స్థలం వద్ద ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని మంథని కాటారం ప్రధాన రహదారి పై మృతుని కుటుంబ సభ్యులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అడ్డుకున్న పోలీసుల తో మృతుని కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. సంఘటనానికి చేరుకున్న గోదావరిఖని ఏసిపి మడత రమేష్ వారికి నచ్చజెప్పి ధర్నా విరవింప చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story