Karimnagar: కరీంనగర్ చౌరస్తాల్లో ఫ్లెక్సీలు.. ప్రమాదాలకు కారణం

Karimnagar: కరీంనగర్‌లో చౌరస్తాల్లో ఫ్లెక్సీలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మున్సిపల్ శాఖ వెంటనే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 23 April 2026 12:25 PM IST
Karimnagar
X

Karimnagar

Karimnagar: కరీంనగర్ పట్టణంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. కోర్టు చౌరస్తా, గీతా భవన్, మంచిర్యాల చౌరస్తా వంటి రద్దీ ప్రాంతాల్లో ఉన్న ఫ్లెక్సీలు రహదారి దృశ్యాన్ని అడ్డుకోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మంచిర్యాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ కారణంగా ఇప్పటికే మూడు నుంచి నాలుగు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. ఇప్పటివరకు పెద్ద ప్రమాదాలు జరగకపోయినా, భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు.

ఒక షాపు ప్రారంభానికి సంబంధించి 18వ తేదీన మున్సిపల్ అనుమతులతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ గడువు ముగిసినా తొలగించకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది. ఈ ఫ్లెక్సీ ట్రాఫిక్ సూచికలను కప్పివేయడంతో వాహనదారులు పరస్పరం గుర్తించలేక ఢీకొనే పరిస్థితి ఏర్పడుతోంది.

ఫ్లెక్సీల అనుమతుల విషయంలో కూడా నిబంధనలు పాటించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక రోజు అనుమతికి రుసుము తీసుకుని, ఫ్లెక్సీలను పలురోజులు కొనసాగించడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ రసీదులు ఉన్నప్పటికీ, గడువు ముగిసిన తర్వాత కూడా ఫ్లెక్సీలు తొలగించకపోవడం గమనార్హం.

ఈ విషయంపై మున్సిపల్ అధికారులను సంప్రదించగా సరైన సమాధానం ఇవ్వకుండా “తొలగిస్తాం” అనే నిర్లిప్త స్పందన మాత్రమే ఇస్తున్నారని స్థానికులు తెలిపారు. ప్రమాదాలకు కారణమవుతున్న ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story