Peddapalli: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం..డీసీపీ రామ్ రెడ్డి!

Peddapalli: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 28 Oct 2026 10:16 AM IST
Peddapalli
X

Peddapalli: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం..డీసీపీ రామ్ రెడ్డి!

Peddapalli: విది నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి అన్నారు. బుధవారం సర్కిల్ పరిధిలోని సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, పొత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పోలీసులు సిఐ పోన్నమనేని రంజిత్ రావు ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సైకిల్ ర్యాలీను తెలంగాణ చౌరస్తా నుండి డీసీపీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ, నిత్యం విధి నిర్వహణలో ఉండి ప్రజలకు సేవలను అందిస్తున్న పోలీసులు పలు సందర్భాల్లో అశువులు బాయడం బాధాకరమని పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. అనంతరం ర్యాలీ తాసిల్ కార్యాలయం, సివిల్ ఆస్పత్రి, శివాలయం, పాత జెండా, పోలీస్ స్టేషన్, రాజీవ్ రహదారి నుండి పూసాల ఎక్స్ రోడ్ నుండి వివేకానంద స్కూల్ వరకు చేరిన ర్యాలీ అనంతరం తిరిగి తెలంగాణ చౌరస్తా కు చేరుకుంది.

ఈ కార్యక్రమంలో ఎస్సైలు చంద్రకుమార్, మధుకర్ , గట్ల సుధాకర్ , సర్కిల్ పరిధిలోని పోలీస్ లతోపాటు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, సుల్తానాబాద్ మండల పాత్రికేయులు, క్రీడాకారులు విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli