Karimnagar: గాంధీజీ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: సీపీఐ
Karimnagar: గాంధీజీ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కరీంనగర్ కోతిరాంపూర్‌లో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Karimnagar: గాంధీజీ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: సీపీఐ
కరీంనగర్: మహాత్మ గాంధీజీ పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్నికాపాడుకోవాలని కోతి రాంపూర్ లో గల గాంధీ విగ్రహానికి సిపిఐ నాయకులుపూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువలు, ప్రజల ఓటు హక్కు రక్షణకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
గాంధీజీకి నివాళులు అర్పించడం అంటే కేవలం జయంతి కార్యక్రమాలు నిర్వహించడం కాదని, ప్రజల హక్కులు, స్వేచ్ఛలు, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పోరాడటమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు .
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజల చేతిలో ఉన్న అత్యంత కీలకమైన ఆయుధమని, అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా పనిచేయాలని సీపీఐ డిమాండ్ చేస్తోందన్నారు.
తెలంగాణలో చేపడుతున్న సర్ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా ఎన్నికల సంఘం, అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు . ఓటర్ల జాబితా సవరణ పేరుతో పేదలు, కార్మికులు, యువత, వలస కార్మికులు, అణగారిన వర్గాల ఓటు హక్కుకు ఎలాంటి ఆటంకం కలగకూడదని, ప్రతి తొలగింపు చట్టబద్ధమైన ప్రక్రియలో జరగాలన్నారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం స్థాపనకు ప్రతి ఒక్క కమ్యూనిస్టు కార్యకర్త ముందుండి పోరాడాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, బ్రాహ్మణపల్లి యుగంధర్, బోనగిరి మహేందర్, నునావత్ శ్రీనివాస్ నగర కార్యవర్గ సభ్యులకు కూన రవి, బాకoఅంజన్న, గణవేని సత్యం జువ్వాజి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.




