Karimnagar: కరీంనగర్లో ఘనంగా ‘సేవా జ్యోతి’ ర్యాలీ!
Karimnagar: కాంగ్రెస్ పార్టీకే ఓట్, సీట్ చోరీ పేటెంట్ రైట్స్ ఉన్నాయని, ప్రధాని మోదీకి అలాంటి పనులు చేయాల్సిన కర్మ లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా.
Karimnagar: కరీంనగర్లో ఘనంగా ‘సేవా జ్యోతి’ ర్యాలీ!
Karimnagar: ఓట్ చోరీ, సీట్ చోరీ పేటెంట్ రైట్స్ కాంగ్రెస్ కే ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో మొట్టమొదటి ఓట్, సీట్ చోరీకి పాల్పడిన ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని చెప్పారు. 1946లో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటీష్ పాలకులు కాంగ్రెస్ కోరిన సమయంలో దేశంలోని ప్రదేశ కాంగ్రెస్ కమిటీలన్నీ తొలి ప్రధాని అభ్యర్ధిగా పటేల్ పేరు ప్రతిపాదిస్తూ ఓట్లేస్తే ఒక్క పీసీసీ మద్దతు కూడా నెహ్రూను ప్రధాని చేసిన ఘనత కాంగ్రెస్ దేనని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీకి ఓట్, సీట్ చోరీకి పాల్పడాల్సిన కర్మ లేనేలేదన్నారు. ఆయనకు కుటంబమే లేదని, బ్యాంకు బ్యాలెన్స్, బినామీ ఆస్తులు, వారసత్వ రాజకీయాలు అవసరమే లేదన్నారు. ప్రధాని పదవి నుండి దిగిపోయిన వెంటనే జబ్బకు సంచి తగిలించుకుని సామాన్యుడిలా ప్రజా సేవలో తరించే మహనీయుడు మోదీ అని అభివర్ణించారు. మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని బీజేపీ కరీంనగర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా నుండి హౌజింగ్ బోర్డు కాలనీ పడవ చౌరస్తా వరకు ‘సేవా జ్యోతి’ ర్యాలీ నిర్వహించారు.




