Manthani: మంథనిలో దట్టమైన పొగమంచు కలకలం!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో మంగళవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు. రహదారులు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు. పూర్తి వివరాలు.

SHANKAR, MANTHANI
Published on: 29 Sept 2026 9:12 AM IST
Manthani
X

Manthani: మంథనిలో దట్టమైన పొగమంచు కలకలం!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో మంగళవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. మండల వ్యాప్తంగా పొగమంచు అలుముకోవడంతో రహదారులు సరిగా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మంథని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహదారులపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రమాద భయంతో వాహనదారులు అప్రమత్తంగా, నెమ్మదిగా ప్రయాణించారు. ప్రయాణికులు సైతం జాగ్రత్తగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.

పొగమంచు కారణంగా మంథని పట్టణం తెల్లని పొర కప్పుకున్నట్టుగా కనిపించింది. ఇళ్ల పైకప్పులు, రహదారులు, వాహనాలపై మంచు కమ్ముకోవడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. తెల్లవారుజామున ఏర్పడిన ఈ వాతావరణ పరిస్థితులు మంథని ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించాయి.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI