Sircilla: కేజీబీవీలకు 10 ల్యాప్‌టాప్‌ల పంపిణీ: డీఈఓ మొండయ్య!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైఐఐఓఈ (YIIOE) పథకంలో భాగంగా కేజీబీవీ పాఠశాలలకు 10 ల్యాప్‌టాప్‌లను జిల్లా విద్యాధికారి ఎస్. మొండయ్య పంపిణీ చేశారు.
Sircilla: కేజీబీవీలకు 10 ల్యాప్‌టాప్‌ల పంపిణీ: డీఈఓ మొండయ్య!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBVs) డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపట్టారు. యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేటివ్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (YIIOE) కార్యక్రమం అమలులో భాగంగా రాష్ట్ర కార్యాలయం కేటాయించిన 10 ల్యాప్‌టాప్‌లను జిల్లా విద్యాధికారి, సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి శ్రీ ఎస్. మొండయ్య సంబంధిత KGBVలకు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి ఎస్. మొండయ్య మాట్లాడుతూ, YIIOE కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్య అందించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధన–అభ్యాస ప్రక్రియలో సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ ల్యాప్‌టాప్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. ఉపాధ్యాయులు, సంబంధిత సిబ్బంది వీటిని సద్వినియోగం చేసి విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలను మరింత మెరుగుపర్చాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జీఈసీఓలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు (Special Officers), సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.




