Peddapalli: సుల్తానాబాద్‌లో ఘనంగా ఎస్జీఎఫ్ జోనల్ క్రీడా పోటీలు - డీఈవో శారద!
Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఎస్జీఎఫ్ జోనల్ స్థాయి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలను ప్రారంభించిన డీఈవో శారద, సీఐ రంజిత్ రావు.
Peddapalli: సుల్తానాబాద్‌లో ఘనంగా ఎస్జీఎఫ్ జోనల్ క్రీడా పోటీలు - డీఈవో శారద!
Peddapalli: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే సమగ్ర వికాసం సాధ్యమవుతుందని పెద్దపల్లి జిల్లా విద్యాధికారి శారద అన్నారు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో ఎస్ జి ఎఫ్ జోనల్ స్థాయి వాలీబాల్ , కోకో, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీలను జిల్లా విద్యాధికారి శారద, సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు ప్రారంభించారు.
ఈ క్రీడలు సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శారద , సీఐ రంజిత్ రావు లు మాట్లాడుతూ ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శారద మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే సమగ్ర వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి, ఏకాగ్రతకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, సహకార భావంతో క్రీడాస్ఫూర్తిని చాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.సుల్తానాబాద్ అంటేనే క్రీడలకు పుట్టినిల్లు అని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోరారు.ఈ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో అండర్ 14 , 17 బాలురు, బాలికలు పాల్గొన్నారు, ఇందులో పెద్దపల్లి, మంథని, రామగుండం, సుల్తానాబాద్ జోన్ల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్బు అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ లక్ష్మణ్ , నోడల్ అధికారి శోభా, జోనల్ సెక్రెటరీ దాసరి రమేష్ , పేట అధ్యక్షులు సురేందర్, మండల విద్యాధికారి రాజయ్య, సీనియర్ క్రీడాకారులు అమీరీ శెట్టి తిరుపతి, కుమార్ కిషోర్, భైరగోని రవీందర్ గౌడ్, గెల్లు మధుకర్ తో పాటు పీఈటీలు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




