Karimnagar: రాజకీయ పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

Karimnagar: కరీంనగర్‌లో ఓటర్ల సవరణ డిప్యూటీ మేయర్ సునీల్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 26 Jun 2026 3:46 PM IST
Karimnagar
X

Karimnagar: రాజకీయ పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

కరీంనగర్: ప్రజలు ఎస్ ఐ ఆర్( సర్) పై రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు.నేడు స్థానికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సర్ పై మీ వద్దకు వచ్చే అధికారులకు సహకరించి వివరాలను తెలుపాలని కోరారు. అపోహలు ఉంటే పూర్తిగా తెలుసుకొని రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడాలని సూచించారు.

రాజకీయ పార్టీల తప్పుడు ప్రచారం వల్ల ప్రజలలో గందరగోళం నెలకొందని దీన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సర్ వల్ల దేశంలో ఎక్కడున్నా ఒకే చోటు నుండి ఓటును వినియోగించుకోవచ్చని ఈ దేశం ఒకే ఓటు ఏర్పడుతుందని అన్నారు. ఓటర్ లిస్ట్ లో ఉన్న తప్పుడు సమాచారాలను తొలగించడానికి సర్ ఎంతో ఉపయోగపడుతుందని రెండు ప్రాంతాల్లో ఉన్న ఓట్లను, సిట్టింగ్ ఓట్లను, మరణించిన ఓట్లను తొలగించి నికాన్ సైనా నిజమైన ఓటర్ లిస్టు ఏర్పడుతుందన్నారు. ముస్లింల ఓట్లను తొలగిస్తున్నారన్న అపోహలను వీడాలని కోరారు.

ఓట్ల సవరణ రెండుసార్లు రిజిస్ట్రేషన్ వంటి వాటిని తొలగించడంతోపాటు భారతీయ పౌరులకు నిజమైన ఓటు హక్కును కలిగించే అవకాశం ఏర్పడుతుందన్నారు. సర్ ప్రక్రియ నిరంతరం కొనసాగే, ప్రక్రియ అని ఆందోళన చెందవలసిన లేదని రాజకీయ పార్టీలు కూడా ప్రజలను గందరగోళానికి గురి చేయకుండా సర్ ప్రజలకు అవగాహన కల్పించి భాగస్వామ్యం కావాలని అన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story