Namsanpalli: నాంసానిపల్లిలో వైభవంగా దేవి నవరాత్రి శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో విగ్రహ నిమజ్జనం

Namsanpalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లిలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

Srimanthula Kondal, Peddapalli
Published on: 23 Oct 2026 8:33 AM IST
Namsanpalli
X

Namsanpalli: నాంసానిపల్లిలో వైభవంగా దేవి నవరాత్రి శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో విగ్రహ నిమజ్జనం

Namsanpalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని నాంసానిపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దేవి నవరాత్రుల ఉత్సవాలు ముగుసాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

​అనంతరం అందంగా అలంకరించిన రథంపై అమ్మవారిని ఆసీనులను చేసి పురవీధుల గుండా శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. శోభాయాత్రలో మహిళలు, యువతుల కోలాట నృత్యాలు, డీజే పాటల హోరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవునా మహిళలు అమ్మవారికి మంగళ హారతులతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు.

​ఈ శోభాయాత్రలో స్థానిక సర్పంచ్ గంగిశెట్టి ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర అనంతరం స్థానిక చెరువులో అమ్మవారి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.

​ఈ సందర్భంగా భవానీ మాలధారులు మాట్లాడుతూ, గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించామని ఈ సంవత్సరం కూడా అదే విధంగా నవరాత్రు ఉత్సవంగా మరింత ఘనంగా నిర్వహించామన్నారు.

నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించి, అమ్మవారి దివ్య ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి చేసుకున్నామని తెలిపారు. వేడుకల నిర్వహణకు సహకరించిన గ్రామ ప్రజలకు, భక్తులకు, దాతలకు మరియు ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, భవానీ మాలధారులు, గ్రామ పురప్రముఖులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli