Vemulawada: రాజన్న ఆలయ నిత్యాన్నదానం ట్రస్టుకు ₹1.50 లక్షల విరాళం!

Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నిత్యాన్నదానం ట్రస్టుకు కామారెడ్డికి చెందిన దంపతులు రూ. 1.50 లక్షల విరాళం అందజేశారు.

BABU, VEMULAWADA
Published on: 4 Nov 2026 5:00 PM IST
Vemulawada
X

Vemulawada: రాజన్న ఆలయ నిత్యాన్నదానం ట్రస్టుకు ₹1.50 లక్షల విరాళం!

Vemulawada: వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నిత్యాన్నదానం ట్రస్టుకు కామారెడ్డికి చెందిన బెజుగం శ్రీకాంత్ రెడ్డి - మంగని సంధ్యారాణి దంపతులు రూ. 1,50,000/- (లక్షా యాభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.

​బెజుగం లింగా రెడ్డి గారి కుమారుడైన శ్రీకాంత్ రెడ్డి దంపతులు బుధవారం ఆలయ ప్రోటోకాల్ కార్యాలయంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీమతి రమాదేవి గారిని కలిసి విరాళం నగదు రూపంలో అందజేశారు. దాతలకు ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం గావించారు.

​ఈ కార్యక్రమంలో ఆలయ (PRO) పెరిక శ్రీనివాస్ మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA