Vemulawada: తులసి పూజలతో భీమేశ్వరాలయానికి భక్తి శోభ!

Vemulawada: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహిళలు ప్రత్యేక తులసి పూజలు, దీపారాధనలు నిర్వహించారు.

BABU, VEMULAWADA
Published on: 24 Nov 2026 11:13 AM IST
Vemulawada
X

Vemulawada: తులసి పూజలతో భీమేశ్వరాలయానికి భక్తి శోభ!

వేములవాడ: పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు తులసి మొక్కల వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వెలిగించిన దీపాల కాంతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా మహిళలు కుటుంబాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థిస్తూ భక్తిపారవశ్యంతో పూజలు చేశారు.

పలువురు భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు తమ ఇళ్ల వద్ద తులసి మొక్కల సమీపంలో దీపాలు వెలిగించి కార్తీక పౌర్ణమి వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. తులసి పూజలు, దీపారాధనలతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA