Kondagattu: పోటెత్తిన భక్తజనం.. నిజస్వరూప దర్శనంతో ఆధ్యాత్మిక శోభ!

Kondagattu: కార్తీక పౌర్ణమి, మంగళవారం మరియు స్వామివారి నిజ స్వరూప దర్శనం కలిసిరావడంతో జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు.

ANAND, JAGITYAL
Published on: 24 Nov 2026 10:56 AM IST
Kondagattu
X

Kondagattu: పోటెత్తిన భక్తజనం.. నిజస్వరూప దర్శనంతో ఆధ్యాత్మిక శోభ!

Kondagattu: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం భక్తులు భారీగా పోటెత్తారు. కార్తీక పౌర్ణమి, అంజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన మంగళవారం, దానికి తోడు స్వామివారి 'నిజ స్వరూప దర్శనం'—ఇలా త్రివేణి సంగమంలా మూడు విశేషాలు ఒకేసారి కలిసిరావడంతో క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది.

ఈ పర్వదినాన స్వామివారి నిజ స్వరూప దర్శన భాగ్యం, గిరి ప్రదక్షిణ కోసం వేలాదిగా భక్తులు తరలిరావడంతో కొండగట్టు పర్వతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరడంతో ఆలయ పరిసరాలన్నీ 'జై హనుమాన్' నామస్మరణతో మార్మోగాయి.

భారీ రద్దీ నేపథ్యంలో భక్తులు తమ వాహనాలను కిందనే దూరంగా పార్కింగ్ చేసి, పాదయాత్రగా కొండపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL