Dharmapuri: 25న ధర్మపురి బస్టాండ్ ఆధునీకరణకు శంకుస్థాపన: మంత్రి!
Dharmapuri: ధర్మపురి బస్టాండ్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఆధునీకరణ పనులకు ఈనెల 25న శంకుస్థాపన చేసి, గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
Dharmapuri: 25న ధర్మపురి బస్టాండ్ ఆధునీకరణకు శంకుస్థాపన: మంత్రి!
ధర్మపురి: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పనతో ధర్మపురి బస్టాండ్ ఆధునీకరణ పనులు జరగనున్నట్లు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు... ఈరోజు మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ధర్మపురి బస్టాండ్ ను ఆర్టిసి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి క్షేత్రానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తూపోతూ ఉంటారని భక్తుల రద్దీకి అనుగుణంగా బస్టాండ్ ప్లాట్ ఫారంల ఎక్స్టెన్షన్ తోపాటు తాగునీరు. మరుగుదొడ్లు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా ఆధునిక సౌకర్యాలతో బస్టాండ్ ఆధునికరణ కు ఈనెల 25న శంకుస్థాపన జరగనున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. వచ్చే సంవత్సరం జూలై మాసంలో గోదావరి పుష్కరాల లోపు నూతన హంగులతో బస్టాండ్ ఆధునికరణ పనులు పూర్తయ్యేలా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు.




