Dharmapuri: చిల్డ్రన్ పార్క్, బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి అడ్లూరి!

Dharmapuri: ధర్మపురి ఇందిరమ్మ కాలనీలో నూతన చిల్డ్రన్ పార్క్, బస్తీ దవాఖానను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు.

RAMESH, DHARMPURI
Published on: 15 Oct 2026 5:33 PM IST
Dharmapuri
X

Dharmapuri: చిల్డ్రన్ పార్క్, బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి అడ్లూరి!

ధర్మపురి: పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత నిస్తోందని చిన్నారులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో గడిపేందుకు చిల్డ్రన్ పార్కులు నిర్మిస్తున్నామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరిలక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ రోడ్ లో ఉన్న ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన చిల్డ్రన్ పార్క్ బస్తి దవాఖానను మంత్రి అడ్లూరి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్ మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి పాల్గొన్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI