Dharmapuri: బీఆర్ఎస్ నేతలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్

Dharmapuri: ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

RAMESH, DHARMPURI
Published on: 3 Sept 2026 8:10 PM IST
Dharmapuri
X

Dharmapuri: బీఆర్ఎస్ నేతలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్

ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు.

మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.... వెయ్యి రోజుల ప్రజాపాలన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు సిద్ధంగా ఉండాలని, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకురావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు.

వెయ్యి రోజులుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ యాస భాషతో ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులతో పాటు ధర్మపురి దేవుడికి సైతం శఠగోపం పెట్టారని మంత్రి గుర్తు చేశారు. మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ఏనాడు ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని మంత్రి అడ్లూరి ఆరోపించారు. ధర్మపురి నియోజకవర్గ వెయ్యి రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి పంపిస్తున్నానని తాను పంపిస్తున్న ప్రోగ్రెస్ రిపోర్టులో ఎలాంటి తప్పులు ఉన్న దేనికైనా సిద్ధమేనని మంత్రి అన్నారు.

ధర్మపురిలో ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు మంత్రి తెలిపారు....ధర్మపురి నియోజకవర్గంలో పనిచేస్తున్న పోలీసు అధికారుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాజీ మంత్రి కొప్పుల మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వందలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని తనపై సైతం 17 కేసులు నమోదు చేయడంతో పాటు పలు సందర్భాల్లో గతంలో పని చేసిన పోలీసులు మ్యాన్ హ్యాండిలింగ్ చేశారని మంత్రి గుర్తు చేశారు.

కొప్పుల ఈశ్వర్ పోలీసులను బెదిరించే ఆలోచన మానుకోవాలని మంత్రి అడ్లూరి అన్నారు.... బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని రానున్న రోజుల్లో రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI

Next Story