Dharmapuri: రూ. 2.57 కోట్లతో ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన
Dharmapuri: జగిత్యాల ధర్మపురిలో రూ.2.57 కోట్లతో బస్‌స్టేషన్ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. 2027 గోదావరి పుష్కరాలకు రూ.226 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
Dharmapuri: రూ. 2.57 కోట్లతో ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన
Dharmapuri: బిఆర్ఎస్ నాయకులకు లోకజ్ఞానం ఉండాలని ఆ ధర్మపురి నరసింహుని మొక్కినా అని ప్రపంచ వ్యాప్తంగా ఎల్ ని నో ప్రభావం ఉందనీ అది బిఆర్ఎస్ నాయకులకు ఎందుకు కనిపించడం లేదు....బిఆర్ఎస్ నాయకులు వర్షం కురిపిస్తే నేను వాళ్ళ కాళ్లు మొక్కుతా అని మంత్రి పొన్నం అన్నారు....
జగిత్యాల జిల్లా ధర్మపురి రూ. 2.57 కోట్ల అంచనా వ్యయంతో ధర్మపురి బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు....
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ:-
బిఆర్ఎస్ నాయకులకు లోకజ్ఞానం ఉండాలని ఆ ధర్మపురి నరసింహుని మొక్కినా అని ప్రపంచ వ్యాప్తంగా ఎల్ ని నో ప్రభావం ఉందనీ అది బిఆర్ఎస్ నాయకులకు ఎందుకు కనిపించడం లేదనీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు....మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు అబద్ధం అంటున్నారనీ అది బిఆర్ఎస్ నాయకులు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అని అన్నారు..బిఆర్ఎస్ నాయకులు వర్షం కురిపిస్తే నేను వాళ్ళ కాళ్లు మొక్కుతా అని మంత్రి పొన్నం అన్నారు.....
తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకులకు పచ్చకామెర్లు ఉన్నోడికి ఊరంతా పచ్చగా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు....
రాష్ట్రంలోని బిఆర్ఎస్ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం వారికి కొత్తేమీ కాదనీ,అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కానీ ఇలా ప్రతిదాన్ని రాజకీయం చేయడం తగదనీ అన్నారు....
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ....
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలు, ఘాట్లు, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 10 కోట్లు, పుష్కర ఘాట్లు, బైపాస్ రహదారులు తదితర అభివృద్ధి పనులకు సుమారు రూ. 226 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, బస్‌స్టేషన్ ఆధునీకరణతో వారికి మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆలయాలు, ఘాట్లు, రహదారుల అభివృద్ధితో పుష్కరాల సమయంలో భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నాగలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ దినేష్,ఆర్.టి.సి. అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు...




