Dharmapuri: ధర్మపురి ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన!

Dharmapuri: జగిత్యాల ధర్మపురిలో రూ.10 కోట్లతో శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి లక్ష్మణ్.

RAMESH, DHARMPURI
Published on: 7 Sept 2026 10:14 AM IST
Dharmapuri
X

Dharmapuri: ధర్మపురి ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన!

Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరాంశమున శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పున: నిర్మాణమునకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ నిధులు రూ 10కోట్ల తో నిర్మాణం చేయనున్న ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పున నిర్మాణం... కళావరోహణ శంకుస్థాపన పూజలు.

హైదరాబాద్ యాజ్ఞిక పీఠం వ్యవస్థాపకులు డాక్టర్ పి.టి.జీ.ఎస్. కిషోర స్వామి యజ్ఞాచార్యులు 16మంది వైధిక బృందము ఆధ్వర్యంలో స్థానిక వేదపండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనకి ముందు ఆలయానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రీ లక్ష్మణ్ కుమార్ కు ఆలయ అధికారులు అర్చకులు.

పూర్ణ కుంభం తో ఘన స్వాగతం పలికినారు, ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం తెలంగాణలోని ప్రసిద్ధ నవనరసింహ క్షేత్రాల్లో ఒకటని, గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించడంతో 'దక్షిణకాశీ', 'తీర్థరాజం', 'హరిహర క్షేత్రం'గా ప్రసిద్ధి చెందిందని తెలిపారు.

వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉగ్ర నరసింహస్వామి ఆలయాన్ని భక్తుల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా విస్తరించడం జరుగుతుందని మరో వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృధి చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి అన్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI

Next Story