Dharmaram: ధర్మారంలో సీఎం రేవంత్ బర్త్‌డే వేడుకల్లో మంత్రి అడ్లూరి

Dharmaram: ధర్మారంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. చామనపల్లికి రూ.350 కోట్ల జీవో విడుదల.

RAMESH, DHARMPURI
Published on: 8 Nov 2026 4:51 PM IST
Dharmaram
X

Dharmaram: ధర్మారంలో సీఎం రేవంత్ బర్త్‌డే వేడుకల్లో మంత్రి అడ్లూరి

ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంత్రి పాల్గొన్నారు 57మంది రక్తం దానం చేశారు. అక్కడ నుండి నాగమణి బానేష్ మరియు సరిత రాయలింగు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి వద్ద దీపావళి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ

పేదల నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దీపావళి పండుగ ఒకేరోజు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని మంత్రి అన్నారు. చామనపల్లి గ్రామాన్ని 100% ముప్పు గ్రామం గా తీసుకొని పరిహారం చెల్లించడానికి 350 కోట్ల జీవో విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు. ధర్మారం మండల కేంద్రంలో సెంట్రింగ్ లైటు,క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ధర్మపురి నియోజకవర్గంలో చివరి ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించి రైతులు ఆకాంక్షలను నెరవేర్చమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI