Dharmaram: పెద్దపల్లి ఓవర్ లోడ్ లారీలను పట్టుకున్న రవాణా శాఖ

Dharmaram: పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఓవర్ లోడ్‌తో వెళ్తున్న నాలుగు లారీలను సీజ్ చేసిన రవాణా శాఖ స్పెషల్ స్కాడ్. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక.

RAMESH, DHARMPURI
Published on: 14 July 2026 2:33 PM IST
Dharmaram
X

Dharmaram: పెద్దపల్లి ఓవర్ లోడ్ లారీలను పట్టుకున్న రవాణా శాఖ

ధర్మారం: పరితిమికి ముంచి వాహనాల్లో రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ స్పెషల్ స్కాడ్ హరిత యాదవ్ హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై, రవాణా శాఖ అధికారుల, తనిఖీలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో అధిక లోడ్ వెళ్తున్న వాహనాలు ఆమె పట్టుకొని కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసారు. రవాణా శాఖ ఇచ్చిన అనుమతులకు లోబడి వాహనాలను రోడ్లపై నడపాలని సూచించారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండలంలోని ఎర్రగుంటపల్లి శివారులో మట్టిని ఓవర్ లోడ్ చేసుకొని వెళ్తున్న నాలుగు లారీలను పట్టుకున్నారు. లారీలకు ఉన్న అనుమతులను పరిశీలించి, వాటిని ఓవర్ లోడ్ తో వెళ్తున్నాయని గుర్తించి వాటిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసారు. ఇక ఎదేచ్చగా కొనసాగుతున్న మట్టి తరలింపుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైనింగ్ శాఖ అధికారులు ఇచ్చిన అనుమతులకు మించి మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ సందర్బంగా అసిస్టెంట్ మోటర్ వెకిల్ ఇన్స్పెక్టర్ హరిత యాదవ్ మీడియాతో మాట్లడుతూ. రవాణా శాఖ ఇచ్చిన అనుమతులను ఉల్లంగిస్తూ ఓవర్ లోడ్ వెళ్తున్న వాహనాలపై, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న ప్రతీ వాహనానికి రవాణా శాఖ ఇచ్చిన అనుమతులు ప్రతిఒక్క వాహనదారుడు కలిగి ఉండాలని సూచించారు.

స్కూల్ బస్సుల కలిగి ఉన్న యజమానులు తమ యొక్క బస్సులకు సంబంధించిన అన్ని అనుమతులు కలిగి ఉంటూ, బస్సు డ్రైవర్ తోపాటు ఒక అటెండర్ ను బస్సులో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. అనుమతులు ఉల్లంగిస్తే చట్టపరమైన చర్యలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖిల్లో మరో అసిస్టెంట్ మోటర్ వెకిల్ ఇన్స్పెక్టర్ రియాజ్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI

Next Story