Karimnagar: తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. డిప్లొమా విద్యార్థిని దుర్మరణం!

Karimnagar: తిమ్మాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం. గుర్తుతెలియని వాహనం ఢీకొని డిప్లొమా విద్యార్థిని శ్రీవిద్య మృతి, మరొకరికి తీవ్ర గాయాలు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 17 Sept 2026 5:00 PM IST
Karimnagar
X

Karimnagar: తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. డిప్లొమా విద్యార్థిని దుర్మరణం!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ తిమ్మాపూర్ మండలంలోని ఓ ఇంజినీరింగ్ కాళాశాలలో చదువుతున్న విద్యార్థినిలు ప్రమాదానికి గురయ్యారు.

బుధవారం రాత్రి ప్రైవేటు హాస్టల్ నుండి శ్రీ విద్య, భావన, లోహిత, శివ ప్రసన్న నలుగురు బయటకు వెళ్లారు. మహాత్మనగర్ పరిధిలోని ఓ హోటల్ సమీపంలోకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ రాజీవ్ రహదారిని దాటుచుండగా అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన శ్రీ విద్య అక్కడికక్కడే మృతి చెందగా, మంచిర్యాలకు చెందిన భావకు తీవ్ర గాయాలు అయ్యాయి.

మరో ఇద్దరు విద్యార్థినిలు అప్పటికే రోడ్డు దాటడంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించడంలో నిమగ్నమయ్యారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఎల్ఎండీ ఎస్సై అన్వర్ కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU