Peddapalli: పెద్దపల్లి జిల్లాలో వికలాంగుల ఆందోళన పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ముత్తారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట వికలాంగుల ఆందోళన.. పెన్షన్ తొలగించడంతో పురుగుల మందు డబ్బాలతో నిరసన, ఉద్రిక్తత.

SHANKAR, MANTHANI
Published on: 16 Sept 2026 2:58 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో వికలాంగుల ఆందోళన పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్!

Peddapalli: రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన సూరం రాజబాబు, పెద్దపల్లి సత్తయ్య తమకు వస్తున్న వికలాంగుల పెన్షన్‌ను అధికారులు రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

పురుగుల మందు డబ్బాలు చేతపట్టుకుని ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకున్న ఇద్దరు వికలాంగులు.. తమ పెన్షన్‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో ఒక వికలాంగుడు ఎంపీడీవో కార్యాలయం పై అంతస్తు నుంచి కిందకు దూకేస్తానంటూ హంగామా చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్రమత్తమైన స్థానికులు అతడిని అడ్డుకుని కిందకు తీసుకొచ్చారు.

తమకు 2017 సంవత్సరం నుంచి వికలాంగుల పెన్షన్ వస్తోందని, అధికారులు ధ్రువీకరించిన లైఫ్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ పెన్షన్‌ను ఎందుకు తొలగించారని వారు ప్రశ్నించారు.

అయితే గ్రామ సర్పంచ్ తాని ప్రభాకర్ ఫిర్యాదు మేరకే పెన్షన్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపినట్లు వికలాంగులు పేర్కొన్నారు. తమ జీవనాధారమైన పెన్షన్‌ను పునరుద్ధరించి న్యాయం చేయాలని సూరం రాజబాబు, పెద్దపల్లి సత్తయ్య అధికారులను కోరారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI