Peddapalli: జిల్లా ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలు.. సద్వినియోగం చేసుకోవాలని పిలుపు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 67 ఏళ్ల వృద్ధురాలికి అత్యంత క్లిష్టమైన కుడి మోకాలి సంపూర్ణ మార్పిడి (TKR) శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.

RAJU, PEDDAPALLI
Published on: 2 Sept 2026 7:30 PM IST
Peddapalli
X

Peddapalli: జిల్లా ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలు.. సద్వినియోగం చేసుకోవాలని పిలుపు!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాకు చెందిన 67 సంవత్సరాల వయస్సు గల మహిళ గత ఒక సంవత్సరం కాలంగా కుడి మోకాలికి సంబంధించిన Grade IV Osteoarthritis సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఆమెకు రక్తపోటు (HTN), మధుమేహం (DM)తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నప్పటికీ, అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి మొట్టమొదటిసారిగా జిల్లాలో నేడు అత్యంత క్లిష్టమైన కుడి మోకాలి సంపూర్ణ మార్పిడి శస్త్రచికిత్స (Right Total Knee Replacement Surgery)ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

ఈ క్లిష్టమైన శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్య బృందం ఆర్థోపెడిషియన్లు డాక్టర్ కుమార్ గౌడ్, డాక్టర్ మేఘన, డాక్టర్ వినయ్ కుమార్ మరియు అనేస్తేషియా డాక్టర్లు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రామం గార్లు. ఇట్టి వైద్య బృందాన్ని, నర్సింగ్ సిబ్బందిని, ఓటీ సిబ్బందిని జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కే శ్రీధర్ గారు అభినందించడం జరిగింది.

మరియు లాప్రోస్కోపీ, యూరాలజీ, లేజర్ చికిత్సలు, ఫిస్టులా వంటి ఎన్నో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు జిల్లాఆసుపత్రి పెద్దపల్లిలో జరుగుచున్నవి.వీటి సేవలను పెద్దపల్లి జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని సూపరిండెంట్ డాక్టర్ కే శ్రీధర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story