Veernapalli: ప్రతి పౌరుడికీ చట్టాలపై అవగాహన అవసరం: వేణు!

Veernapalli: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. చట్టాలపై అవగాహనతోనే ప్రజలు తమ హక్కులను కాపాడుకోగలరని లోక్ అదాలత్ సభ్యుడు ఆడెపు వేణు అన్నారు.

KALEEM, SIRICILLA
Published on: 8 Oct 2026 6:35 PM IST
Veernapalli
X

Veernapalli: ప్రతి పౌరుడికీ చట్టాలపై అవగాహన అవసరం: వేణు!

వీర్నపల్లి: ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి, అందరికీ సులభంగా న్యాయం అందించాలనే లక్ష్యంతో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాది ఆడెపు వేణు తెలిపారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం వీర్నపల్లి మండల కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ ఆదేశాలతో, సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పి. లక్ష్మణాచారి సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆడెపు వేణు మాట్లాడుతూ.. ప్రతి పౌరుడికి న్యాయ అవగాహన ఎంతో అవసరమని అన్నారు. చట్టాలపై అవగాహన ఉంటేనే వ్యక్తులు తమ హక్కులను సమర్థవంతంగా రక్షించుకోగలరని తెలిపారు.

సమాజంలోని బలహీన వర్గాలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు తమ హక్కులను వినియోగించుకునేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని వివరించారు. ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు, తమ హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు గుర్రం ఆంజనేయులు, న్యాయవాదులు బూర మధుసూదన్, కోనేటి నరేష్, ఎస్సై లక్ష్మణ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA