Karimnagar: వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం!

Karimnagar: కరీంనగర్‌లో వయోవృద్ధుల దినోత్సవం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ హాజరు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 1 Oct 2026 8:53 PM IST
Karimnagar
X

Karimnagar: వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం!

కరీంనగర్: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కరీంనగర్ లోని ప్రభుత్వ వృద్ధుల మరియు దివ్యాంగుల వసతి గృహంలో వయోవృద్ధులకు వైద్య పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ యస్. శివకుమార్ అనుమతితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ పాల్గొని వయోవృద్ధుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వయోవృద్ధులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య సమస్యలను గుర్తించారు. అవసరమైన వారికి మందులు, వైద్య సలహాలు, సూచనలు అందించారు.

వయోవృద్ధులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని యశ్వంత్ సింగ్ సూచించారు. వయోవృద్ధుల హక్కులు, సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. వయోవృద్ధులకు అందుబాటులో ఉన్న న్యాయ సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు సంస్థ తరఫున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

వయోవృద్ధులు తమ జీవిత అనుభవంతో కుటుంబానికి, సమాజానికి అందించిన సేవలు ఎంతో విలువైనవని, వారిని గౌరవించడం, ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని యశ్వంత్ సింగ్ అన్నారు. వయోవృద్ధులు గౌరవం, భద్రత, ఆత్మగౌరవంతో జీవించేలా కుటుంబ సభ్యులు, సమాజం సహకరించాలని సూచించారు.

వయోవృద్ధుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల సమాజంలో మరింత అవగాహన కల్పించడంతో పాటు, వారికి అవసరమైన న్యాయ, సామాజిక సహాయాన్ని అందించేందుకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

వైద్య శిబిరంలో పాల్గొన్న వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డా. రాజ గోపాల్ రావు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాది ఏ. కిరణ్ కుమార్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎలుగు తణ్మయి, శ్రీపతి భావన, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. విప్లవశ్రీ మెడికల్ ఆఫీసర్ డా. ఇమ్రాన్ ఖాన్, వసతి గృహ వార్డెన్ యం. రాధిక, నర్సింగ్ ఆఫీసర్ తోట సృజన, వైద్యులు హారిక, మొహమ్మద్ ఆరిఫ్, టీ. సాయిదీప్ లు వృద్ధులు, సిబ్బంది పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN