Siricilla: సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ!

Siricilla: డీఎంహెచ్ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ చిన్న బోనాల సబ్‌సెంటర్‌లో సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు.

KALEEM, SIRICILLA
Published on: 29 July 2026 8:23 PM IST
Siricilla
X

Siricilla: సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చిన్న బోనాల సబ్ సెంటర్‌లో నిర్వహిస్తున్న సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా టీకా సెషన్ నిర్వహణ, వ్యాక్సిన్ నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణ, లబ్ధిదారుల నమోదు, టీకాల వినియోగం, మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డుల నిర్వహణను పరిశీలించారు. జాతీయ టీకా షెడ్యూల్ ప్రకారం అర్హులైన ప్రతి గర్భిణి, శిశువు, చిన్నారికి అన్ని టీకాలు తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు.

టీకాలపై గ్రామస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, టీకాలకు గైర్హాజరైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే టీకాలు అందించాలని ఆదేశించారు. టీకా కార్యక్రమాల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.

ఈ తనిఖీలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. సంపత్‌కుమార్, VCCM నవీన, ఏఎన్‌ఎంలు, సంబంధిత ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story