Sircilla: ఏబీ నగర్ యూపీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏబీ నగర్ యూపీహెచ్‌సీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జి. ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sircilla: ఏబీ నగర్ యూపీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏబీ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC)ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డా. జి. ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీలో భాగంగా రోగుల నమోదు, వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, ప్రయోగశాల సేవలు, గర్భిణీలకు అందుతున్న సేవలు, టీకాల కార్యక్రమం, పారిశుద్ధ్యం, సిబ్బంది హాజరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన, సమయానుకూల వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించాలని, ప్రతి రోగికి మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని ఆదేశించారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని, అధిక రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌ను వేగవంతం చేయాలని, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. ఈ తనిఖీలో వైద్యాధికారి డాక్టర్ గీతాంజలి, ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.




