Peddapally: పెద్దపల్లిలో చెట్టుకు కట్టిన బొమ్మలు కలకలం!

Peddapally: పెద్దపల్లి మండలం పెద్దకల్వల-పెద్దబొంకూర్ మధ్య చెట్టుకు బొట్లు పెట్టిన బొమ్మలు కట్టి ఉండటం కలకలం రేపింది. క్షుద్రపూజల కోణంలో స్థానికుల అనుమానాలు.

RAJU, PEDDAPALLI
Published on: 6 Sept 2026 9:05 AM IST
Peddapally
X

Peddapally: పెద్దపల్లిలో చెట్టుకు కట్టిన బొమ్మలు కలకలం!

Peddapally: పెద్దపల్లి జిల్లాలో ఓ చెట్టుకు కట్టిన బొమ్మలు కలకలం రేపుతున్నాయి. పెద్దపల్లి మండలం పెద్దకల్వల–పెద్దబొంకూర్ మధ్య మెయిన్ రోడ్డు పక్కన ఓ చెట్టుకు కొన్ని బొమ్మలను కట్టి ఉంచారు. బొమ్మలకు బొట్టు పెట్టి ఉండటంతో ఇవి క్షుద్రపూజలకు సంబంధించినవా? అంటూ అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ బొమ్మలను అక్కడ ఎవరు కట్టారు..? ఎందుకు కట్టారు..? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.

పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల–పెద్దబొంకూర్ మధ్య రోడ్డుపక్కన ఈ ఘటన కనిపించింది. చెట్టుకు పలు బొమ్మలను కట్టి, వాటికి బొట్లు పెట్టి ఉంచారు. దీంతో అటుగా రాకపోకలు సాగించే వారిలో చర్చ మొదలైంది. క్షుద్రపూజలు చేసి బొమ్మలను ఇలా కట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఈ బొమ్మలను అక్కడ ఎవరు ఏర్పాటు చేశారు..? వాటి వెనుక అసలు కారణమేంటి..? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story