Sunke Ravishankar: మార్కులు తక్కువొచ్చాయని బాధపడకండి.. విద్యార్థులకు రవిశంకర్ భరోసా!
Sunke Ravishankar: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల నేపథ్యంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు.
Sunke Ravishankar: మార్కులు తక్కువొచ్చాయని బాధపడకండి.. విద్యార్థులకు రవిశంకర్ భరోసా!
Sunke Ravishankar: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థుల మనోభావాలను గౌరవించాలని కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పిలుపునిచ్చారు. పరీక్షల్లో ఫెయిల్ అయినా లేదా ఆశించిన ర్యాంకులు రాకపోయినా విద్యార్థులను ఇతరులతో పోల్చడం తగదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పక్కింటి పిల్లలు లేదా ఎక్కువ మార్కులు సాధించిన వారితో పోల్చడం వల్ల చిన్న మనసున్న విద్యార్థులు తీవ్రంగా నిరుత్సాహానికి గురవుతారని తెలిపారు.
ప్రతి విద్యార్థికి తన సొంత ప్రతిభ, సామర్థ్యం ఉంటుందని, ఒక్క పరీక్ష ఫలితమే జీవితాన్ని నిర్ణయించదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమయంలో తల్లిదండ్రులు, బంధువులు, సమాజం కలిసి విద్యార్థులకు ధైర్యం చెప్పాలని సూచించారు. వారిని విమర్శించడం కాకుండా హక్కుగా దగ్గరగా తీసుకుని మళ్ళీ రాబోయే పరీక్షలకు సిద్ధం అయ్యేలా ప్రోత్సహించాలని అన్నారు.
విద్యార్థులు పడిన కష్టాన్ని గుర్తించి, వారి మనోధైర్యాన్ని పెంపొందించడం ఎంతో అవసరమని సుంకే రవిశంకర్ తెలిపారు. ఇలా చేయడం ద్వారా మాత్రమే మన పిల్లలకు నిజమైన చేయూత ఇచ్చినట్లవుతుందని, వారి భవిష్యత్తుకు మనం కొండంత అండగా నిలవగలమని పేర్కొన్నారు.




