Karimnagar: తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు ఇచ్చాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

Karimnagar: మానకొండూరులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు. తెలంగాణకు కేంద్రం రూ. 10 లక్షల కోట్లు ఇచ్చిందని వెల్లడి.

ANJANEYULU, MANAKONDURU
Published on: 16 Jun 2026 12:54 PM IST
Karimnagar
X

Karimnagar: తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు ఇచ్చాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ జిల్లా: మానకొండూరు మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చాయిపేట్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్.

బండి సంజయ్ కుమార్ ప్రెస్ మీట్

"గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం ₹10 లక్షల కోట్లు కేటాయించింది. రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ 'డబుల్ ఇంజన్ సర్కార్' రావాలి.

అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు, ఒక్కసారి బీజేపీకి అధికారమిచ్చి చూడాలని ప్రజలను కోరుతున్నాను. ​మరోవైపు, సమాజంలో మావోయిస్ట్ భావజాలం వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది.

తుపాకీ సంస్కృతి, మారణహోమంతో సాధించేది ఏమీ లేదు. ఏమీ తెలియని మైనర్ పిల్లల చేత తుపాకులు పట్టించడం దారుణం. చాలామంది వాస్తవాన్ని గ్రహించి లొంగిపోయారు.

ఇంకా ఆ ఆలోచనల్లో ఉన్నవారు తమ భవిష్యత్తు కోసం మారాలి.

​యువత విషయానికొస్తే, 'ప్రధానమంత్రి రోజ్‌గార్ మేళా' ద్వారా సంవత్సరన్నరలోనే 12 లక్షల కేంద్ర ఉద్యోగాలు ఇచ్చాము. 'కిసాన్ సమ్మాన్ నిధి', పెంచిన MSP ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం.

'స్టార్టప్ ఇండియా' ద్వారా 23 లక్షల మందికి ఉపాధి లభించింది. విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story