Sircilla: ఫోర్ లేన్‌కు కదలిక..కేంద్రానికి చేరిన డీపీఆర్ ప్రతిపాదనలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల - సిద్దిపేట జాతీయ రహదారి (NH-365B) నాలుగు లేన్ల విస్తరణకు సంబంధించిన డీపీఆర్ ఆమోద ప్రక్రియ వేగవంతమైంది.
Sircilla: ఫోర్ లేన్‌కు కదలిక..కేంద్రానికి చేరిన డీపీఆర్ ప్రతిపాదనలు!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న సిరిసిల్ల–సిద్దిపేట (దుద్దెడ) జాతీయ రహదారి (NH-365B) నాలుగు లేన్ల విస్తరణ పనుల్లో పురోగతి కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ఆమోద ప్రక్రియ వేగవంతం అయ్యేలా కేంద్ర స్థాయిలో చర్యలు ప్రారంభమైనట్లు సమాచారం.
ఈ రహదారి విస్తరణకు సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కార్యాలయం జూలై 30, 2026న కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖకు అధికారికంగా లేఖను పంపింది.
హోంశాఖ సహాయ మంత్రి కార్యాలయం నుంచి రోడ్డు రవాణా శాఖకు పంపిన లేఖలో, నిబంధనల ప్రకారం డీపీఆర్ ఆమోదానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిసింది.
ఈ పరిణామంతో సిరిసిల్ల–సిద్దిపేట ఫోర్ లేన్ ప్రాజెక్టు ఆమోద ప్రక్రియ వేగవంతం అవుతుందని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు అమల్లోకి వస్తే రెండు జిల్లాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా ఊతమిస్తుందని స్థానికులు భావిస్తున్నారు.




