Karimnagar: ఈ నెల 10న మోదీ ‘జనాగ్రహ సభ’.. తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!

Karimnagar: ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కీలక ప్రకటన చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 1 May 2026 9:56 AM IST
Karimnagar
X

Karimnagar: ఈ నెల 10న మోదీ ‘జనాగ్రహ సభ’.. తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!

కరీంనగర్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బీజేపీ కి ఉన్న రిపోర్టు , అంచనాలకు అనుగుణంగా గణనీయ విజయాలు సాధిస్తుందని, అంచనాలకు మించిన ఫలితాలు వస్తాయని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లోని గణేష్ నగర్ బైపాస్ రోడ్డులో గల అదితి హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు.

తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పలికేలా ఈ నెల 10న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారని,. ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఈనెల భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్, ఇండియా కూటమి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేలా ఈనెల 10న, “జనాగ్రహ సభ”ను నిర్వహించడానికి బిజెపి తెలంగాణ పార్టీ సన్నాహాలు చేస్తుందని, ప్రధాని మోదీ హాజరయ్యే ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది హాజరవుతారని, ఇది తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే సభగా నిలుస్తుందన్నారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని ఆయన ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రాన్ని ఏ లా నడపాలో అర్థం కాని స్థితిలో పాలన కొనసాగిస్తుందన్నారు. ఇక బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు విఆర్ఎస్ ఇచ్చారని , ఆ పార్టీ అవుట్ డేటెడ్ పార్టీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రదమంగా కరీంనగర్‌లో తొలి మేయర్‌గా బీజేపీ అభ్యర్థి గెలవడం ప్రజల్లో మార్పు సంకేతమని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో బిజెపిపై ఏనలేని నమ్మకం పెరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో పాటు,జిల్లా అద్యక్షుడు కృష్ణారెడ్డి, కరీంనగర్ మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, ఇతర బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story