Ramagundam: డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తుకు ముప్పు: డీసీపీ రామ్ రెడ్డి
Ramagundam: పెద్దపల్లి జిల్లా చందనాపూర్ జెడ్పీ హైస్కూల్‌లో జరిగిన 'మిషన్ పరివర్తన' సదస్సులో డ్రగ్స్ యువత భవిష్యత్తుకు ముప్పు అని డీసీపీ బి. రామ్ రెడ్డి హెచ్చరించారు.
Ramagundam: డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తుకు ముప్పు: డీసీపీ రామ్ రెడ్డి
రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, గోదావరిఖని 2 టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో మిషన్ పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లల భద్రత, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై విద్యార్థులు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసిపి మడత రమేష్ లు మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, ఒక్కసారి బానిస అయితే ఆరోగ్యం, చదువు, కుటుంబం దెబ్బతింటాయని అన్నారు. డ్రగ్స్ విక్రయం, వినియోగం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్ లు, లింకులు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో 2 టౌన్ సీఐ ఎన్. ప్రసాదరావు, ఎస్సై ఎన్. లక్ష్మణ్, సర్పంచ్ లు కొండ మంజుల-శ్రీనివాస్, జుల యమున-శ్రీనివాస్, ఉప సర్పంచ్ చిగురు రజిత రామచందర్, స్కూల్ ప్రిన్సిపాల్ మేడి లక్ష్మి, పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు సుమారు 200 మంది పాల్గొన్నారు.




