Peddapalli: మద్యం మత్తులో హోటల్ యజమానిపై దాడి.. సామగ్రి ధ్వంసం!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చీకురాయి రోడ్డులో మద్యం మత్తులో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు.

RAJU, PEDDAPALLI
Published on: 7 Sept 2026 7:24 PM IST
Peddapalli
X

Peddapalli: మద్యం మత్తులో హోటల్ యజమానిపై దాడి.. సామగ్రి ధ్వంసం!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. హోటల్ యజమానిపై దాడి చేసి, హోటల్ అద్దాలను ధ్వంసం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చీకురాయి రోడ్ లో మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్‌చల్ చేశారు. ఓ హోటల్ లోకి వెళ్లి హోటల్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో యజమాని తలకు గాయాలయ్యాయి.

అంతటితో ఆగకుండా హోటల్ లోని సామాగ్రిని ధ్వంసం చేసి, అద్దాలను పగులగొట్టారు. అడ్డు వచ్చిన వారిని బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. వీరంగం సృష్టించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story