Sircilla: తంగళ్ళపల్లి అగ్రి కాలేజీలో డీఎస్పీ నాగేంద్రచారి క్లాస్!
Sircilla: వ్యవసాయ కళాశాలలో డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఈగల్ టీమ్ సంయుక్తంగా విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు.
Sircilla: తంగళ్ళపల్లి అగ్రి కాలేజీలో డీఎస్పీ నాగేంద్రచారి క్లాస్!
సిరిసిల్ల: విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తు కోసం లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు.సోమవారం తంగ్గళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ కళాశాలలో తెలంగాణ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదకద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తును నాశనం చేస్తాయని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల కదలికలపై అధ్యాపకులు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయం, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సమాజాన్ని ఈ ముప్పు నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో డ్రగ్స్ లేదా గంజాయి విక్రయం, రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 8712671111కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఈగల్ టీమ్ డీఎస్పీ ఉపేందర్, ఎస్‌ఐ ఉపేందర్ చారి, వ్యవసాయ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.




