ప్రభుత్వ పాఠశాలల కుదింపు.. ఉద్యమిస్తామంటున్న టీచర్స్ ఫెడరేషన్!
Karimnagar: ప్రభుత్వ పాఠశాలలను 27 వేల నుంచి 4 వేలకు కుదిస్తామన్న సీఎం ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF).
ప్రభుత్వ పాఠశాలల కుదింపు.. ఉద్యమిస్తామంటున్న టీచర్స్ ఫెడరేషన్!
Karimnagar: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను 27 వేల నుంచి 4 వేలకు కుదిస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని *డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి, ప్రధాన కార్యదర్శి చకినాల రామ్‌మోహన్‌లు డిమాండ్ చేశారు. తాము అధికారంలో కొస్తే ఒక్క పాఠశాలను కూడా మూసివేయనని, బడ్జెట్ లో విద్యారంగాని 15% నిధులు కేటాయిస్తామనీ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రైవేటు విద్యారంగాన్ని, ఫీజులను నియంత్రిస్తామని, ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ తిరోగమన విధానాన్ని ప్రకటించడం సరికాదన్నారు.
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండా, ఇలా పాఠశాలలను మూసి వేసుకుంటూ వెళ్తే త్వరలో ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా కనుమరుగై, విద్యారంగ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. దీని ద్వారా పేద విద్యార్థులకు విద్య అంద కుండా పోయే అవకాశం ఉందన్నారు. ఈ చర్య ద్వారా సామాజిక, ఆర్థిక సమానతలు మరింత పెరిగిపోతాయి అన్నారు. ఈ కుదింపు ప్రక్రియ అంతా ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుగుణంగా చేపట్టే విధానాలే అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.
ఇప్పటికైనా బడ్జెట్ల్.విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి, విద్యారంగ సమస్యలు పరిష్కరించి, ప్రతి ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి, సరైన పర్యవేక్షణ, సరైన మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని సోమయ్య, లింగారెడ్డిలు కోరారు. లేనిచో పాఠశాలల రేషనలైజేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల కుదింపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఆవాల నరహరి, జిల్లా అధ్యక్షులు. చకినాల రామ్‌మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి.




