Jagtial: దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు వలస కూలీలు దుర్మరణం!

Jagtial: దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 10 Jun 2026 10:53 AM IST
Jagtial
X

 Jagtial: దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు వలస కూలీలు దుర్మరణం!

జగిత్యాల: జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు దుబాయిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సమాచారం ప్రకారం, సాంకేతిక లోపం కారణంగా రోడ్డుపై అకస్మాత్తుగా ఆగిపోయిన ఒక లారీని వెనుక నుంచి వస్తున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.

మృతుల్లో కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం, మల్యాల మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి తిరుపతి గౌడ్, మెట్పల్లి ప్రాంతంలోని గాజులపేటకు చెందిన అబ్దుల్ రఫిక్ ఉన్నారు.

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వీరు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఘటన విషయం తెలిసిన వెంటనే బంధువులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకురావడానికి సంబంధిత అధికారులతో కుటుంబ సభ్యులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆయా గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story