Karimnagar: బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టించాలి!

Karimnagar: కరీంనగర్‌లో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 5 Aug 2026 9:27 AM IST
Karimnagar
X

Karimnagar: బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టించాలి!

Karimnagar: బిడ్డ పుట్టిన గంటలోపలే శిశువుకు తల్లి పాలు పట్టించాలని, అప్పుడే బిడ్డ జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి అన్నారు.

కరీంనగర్ లోని జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డిడబ్ల్యూఒ మాట్లాడుతూ గంటలోపు ఇచ్చే ముర్రుపాలు అమృతంతో సమానమని అన్నారు. తల్లిపాలల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, శిశువు పుట్టిన ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలు తప్ప ఎటువంటి ఆహారము ఇవ్వకూడదని తెలిపారు. ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం అందించాలని అన్నారు.

అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం బిడ్డ ఎదుగుదలకు చక్కని ఆహారమని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు బలవర్ధక ఆహారం తీసుకోవాలని, బిడ్డకు అది ఆరోగ్యకరమని అన్నారు. తల్లిపాలు ఇవ్వడంలో కుటుంబ సభ్యుల సహకారం అవసరమని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్ మహేష్, అంగన్వాడీ సిబ్బంది, బాలింతలు, గర్భిణీలు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story