Sultanabad: బహిరంగ క్షమాపణ చెప్పాలి! మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై నిరసనల సెగ

Sultanabad: ప్రధాని మోదీపై మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సుల్తానాబాద్‌లో బీజేపీ ఆందోళన.

KONDAL, SULTANABAD
Published on: 23 April 2026 5:01 PM IST
Sultanabad
X

Sultanabad: బహిరంగ క్షమాపణ చెప్పాలి! మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై నిరసనల సెగ

Sultanabad: సుల్తానాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే దిష్టి బొమ్మ దహనానికి యత్నం, ప్రధానిని 'టెర్రరిస్ట్' అనడం కాంగ్రెస్ దివాళాకోరుతనానికి నిదర్శనం, ప్రజాస్వామ్యాన్ని కాలితో తన్నిన కాంగ్రెస్, కాంగ్రెస్ డి.ఎన్.ఏ. లోనే వ్యక్తులను అవమానించే సంస్కృతి, సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి లతో నిరసన తెలిపి దిష్టి బొమ్మ దహన చేసేందుకు యత్నించిన బిజెపి నాయకులు.

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన 'టెర్రరిస్ట్' అనే వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని, ఇవి ఆయన అజ్ఞానానికి, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, కోశాధికారి రాజేంద్రప్రసాద్ తీవ్రంగా ఖండించారు. వయసు పెరిగే కొద్దీ విజ్ఞత పెరగాలి కానీ ఖర్గే మాటల్లో వివేకం లోపించిందని, 140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదంతో వరుసగా మూడోసారి పీఠాన్ని అధిరోహించిన ప్రధానిని అవమానించడం అంటే ప్రజా తీర్పును కాలితో తన్నడమేనని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ధి అజెండాపై పోటీ పడలేక, ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, జీ20 సదస్సు, చంద్రయాన్ వంటి చారిత్రక ఘనతలను జీర్ణించుకోలేని కాంగ్రెస్, నిరాశా నిస్పృహలతో ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగజారిందని విమర్శించారు. గతంలో చాయ్‌వాలా అని, నీచ్ అని, మౌత్ కే సౌదాగర్ అని ప్రధానిని అవమానించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 'టెర్రరిస్ట్' అనడం వారి సంస్కృతిని ప్రతిబింబిస్తోందని, దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే నాయకుడిపై బురద చల్లడం అంటే భారతమాతను అవమానించడమేనని, ఎమర్జెన్సీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీకి ఇతరుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కేవలం వ్యక్తి కాదు, కోట్లాది మంది భారతీయుల ఆశల ప్రతిరూపమని, సర్జికల్ స్ట్రైక్స్ నుండి మొదలుకొని పేదవాడి కళ్లలో ఆనందం చూసే ప్రతి పథకం మోదీ నాయకత్వంలోని గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు.

తన వ్యాఖ్యలకు మల్లికార్జున ఖర్గే బేషరతుగా దేశ ప్రజలకు, భారతమాతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ప్రజా క్షేత్రంలో వారు మరింత దిగజారిపోతారని, 2029 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని తీవ్రంగా హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు కానీ బరితెగింపు, నీచమైన పదజాలం సరికాదని, ప్రతిపక్షాలకు ఉండాల్సిన బాధ్యతను కాంగ్రెస్ విస్మరించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తా దగ్గర ప్రాంతంలో మల్లికార్జున ఖర్గే గారి దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డగించారు, అనంతరం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు వేల్పుల రాజన్న పటేల్, కొమ్ము తిరుపతి యాదవ్,బీజేపీ నాయకులు కందునూరి కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్ కుమార్,ఉపాధ్యక్షులు దొంగల శ్రీనివాస్ రెడ్డి,దాసరి వెంకటేష్, ఎర్రం సంతోష్ రెడ్డి,యువ మోర్చా నాయకులు కొమ్మిడి రాజేందర్ రెడ్డి, ఉషణ అన్వేష్, వడ్లకొండ శశి వర్ధన్, సీనియర్ నాయకులు నాగుల్లమల్యాల తిరుపతి,మెండే శంకరయ్య,మల్కా భాగ్యలక్ష్మి, బండారి లత,చిట్టవేణి సదయ్య, వీరగోని కిరణ్ గౌడ్,ఎనగందుల ఎల్లయ్య,కలవాల శ్రీనివాస్ రెడ్డి,వలస సాయి కిరణ్,సుబ్బని సురేష్ తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story