Korutla: కోరుట్లలో కాలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటీ - తప్పిన పెను ప్రమాదం!
Korutla: జగిత్యాల జిల్లా కోరుట్ల సాయిరాంపూర్ కాలనీలో ఛార్జింగ్‌లో ఉండగా ఒక్కసారిగా పేలి దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటీ. రూ. లక్ష వరకు ఆస్తి నష్టం.
Korutla: కోరుట్లలో కాలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటీ - తప్పిన పెను ప్రమాదం!
Korutla: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరాంపూర్ కాలనీలో ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీ ఒక్కసారిగా పేలిపోయి పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఇంట్లో పెను ప్రమాదం తప్పింది. ఎలేస్కో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీ ఛార్జింగ్ పెట్టిన సుమారు పది నిమిషాలకే ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో, దీంతో అప్రమత్తమైన వాహనదారుడు బయటకు వచ్చి చూడగా స్కూటీ మంటల్లో కాలిపోతున్నట్లు గుర్తించారు.
వెంటనే స్పందించి నీటితో మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం మరింత పెద్దదిగా మారకుండా నివారించారు. అయితే అప్పటికే స్కూటీ పూర్తిగా దగ్డమవడంతో పాటు ఇంటిలోని కొన్ని పరికరాలు కూడా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.




