Ellareddypeta: ఎల్లారెడ్డిపేట ర్యాగింగ్ నిరోధక అవగాహన సదస్సు

Ellareddypeta: ఎల్లారెడ్డిపేట గాయత్రి కళాశాలలో ర్యాగింగ్, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన. ర్యాగింగ్ నేరమని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన న్యాయ నిపుణులు.

KALEEM, SIRICILLA
Published on: 17 July 2026 5:12 PM IST
Ellareddypeta
X

Ellareddypeta: ఎల్లారెడ్డిపేట ర్యాగింగ్ నిరోధక అవగాహన సదస్సు

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని గాయత్రి డిగ్రీ & పీజీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాగింగ్ నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ర్యాగింగ్ చేయడం చట్టపరంగా శిక్షార్హమైన నేరమని, అలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ టి. పరశురాములు హెచ్చరించారు.

కొత్తగా చేరిన విద్యార్థులు భయపడకుండా విద్యాభ్యాసం చేసే వాతావరణం కల్పించడం ప్రతి విద్యాసంస్థ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు పరస్పరం గౌరవం, స్నేహభావంతో మెలగాలని సూచించారు.

అదే కార్యక్రమంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై కూడా అవగాహన కల్పించారు. మత్తు పదార్థ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story