Kondagattu: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న దేవాదాయ కమిషనర్ హన్మంతరావు

Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ అంజన్న స్వామిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హన్మంతరావు దర్శించుకున్నారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 28 April 2026 9:23 PM IST
Kondagattu
X

Kondagattu: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న దేవాదాయ కమిషనర్ హన్మంతరావు

Kondagattu: జగిత్యాల జిల్లా,మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ అంజన్న స్వామిని ఈరోజు దేవాదాయ శాఖ కమిషనర్ యం. హన్మంతరావు దర్శించుకున్నారు.

ధర్మపురి దేవాలయ విస్తరణ మాస్టర్ ప్లాన్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన కొండగట్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ, అర్చక బృందం మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిషనర్‌ను శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ హన్మంతరావు మాట్లాడుతూ, బాసర నుండి భద్రాచలం వరకు ఉన్న ప్రధాన దేవాలయాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగానే ధర్మపురి దేవాలయ విస్తరణ పనులపై మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

త్వరలోనే కొండగట్టు ప్రాంతాన్ని కూడా మహాక్షేత్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story