Ramagundam: ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలి!
Ramagundam: రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
Ramagundam: ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలి!
Ramagundam: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాలని, ఏ ఒక్క పరీక్షను కూడా బయటకు పంపించకుండా ఆసుపత్రిలోనే నిర్వహించేలా అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
రామగుండంలోని సింగరేణి వైద్య కళాశాలలో నిర్వహించిన వైద్య కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇందుకు అవసరమైన పరికరాల వివరాలు, అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు.
ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా, పారదర్శకంగా వినియోగించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ప్రాధాన్యత క్రమంలో వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణం నుంచి క్రిటికల్ కేర్ బ్లాక్ వరకు చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందు సింగ్, సీఎస్ఆర్ డాక్టర్ కృపాభాయ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ కిరణ్, టీజీఎంఐడీసీ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




